గురువారం 09 జూలై 2020
Telangana - Apr 14, 2020 , 14:37:58

బగ్గా వైన్స్‌ పేరిట నకిలీ క్యూఆర్‌ కోడ్‌

బగ్గా వైన్స్‌ పేరిట నకిలీ క్యూఆర్‌ కోడ్‌

హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలంటూ సైబర్‌ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. క్యూఆర్‌ కోడ్‌కు డబ్బు పంపితే మద్యం సరఫరా చేస్తామంటూ మోసం చేశారు. సుల్తాన్‌ బజార్‌కు చెందిన వ్యక్తికి బగ్గా వైన్స్‌ పేరిట నకిలీ క్యూఆర్‌ కోడ్‌ సృష్టించి పంపించారు దుండగులు. దీంతో అతను తొలుత రూ. 1600 పంపించాడు. ఖరీదైన మద్యం సీసాలు ఉన్నాయంటూ మరోసారి 3 కేవైసీ నంబర్లు దుండగులు పంపించారు. ఆన్‌లైన్‌ ద్వారా మరోసారి రూ. 92 వేలు పంపాడు బాధితుడు. ఆ తర్వాత మద్యం ఇంటికి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన బాధిత వ్యక్తి.. దుండగులు ఫోన్‌ చేసినా నంబర్‌కు ఫోన్‌ చేస్తే స్పందించలేదు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. logo