సోమవారం 18 జనవరి 2021
Telangana - Nov 27, 2020 , 19:09:24

నకిలీ పోలీస్ అరెస్టు

నకిలీ పోలీస్ అరెస్టు

ఖమ్మం : ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసు స్టేషన్ పరిధిలో వాహనదారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీసును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కూసుమంచి సీఐ కె.సతీశ్‌ తెలిపారు. నిందితుడిని మోరంపల్లి బంజారా మండలం అంజనాపురానికి చెందిన గూగులోతు అకిల్ నాయక్ (20)గా గుర్తించారు. జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో పోలీసుగా, ఫారెస్ట్ బీట్ అధికారిగా, రైల్వే ఉద్యోగిగా అకిల్ నాయక్‌ అక్రమాలకు పాల్పడుతున్నాడు.

ఇటీవల సంధ్యాతండా వద్ద ఇసుక ట్రాక్టర్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఓ వ్యక్తి పోలీసులకు అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం కూసుమంచి మండలం శివాలయం క్రాస్‌రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న అకీల్ నాయక్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. నేరాలు అంగీకరించడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కూసుమంచి సీఐ సతీశ్‌, ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.