బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:52:10

ప్లాస్మా ఇస్తానని 200 మందికి టోకరా

ప్లాస్మా ఇస్తానని 200 మందికి టోకరా

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా నుంచి కోలుకున్నానని.. ప్లాస్మా కావాలంటే ఇస్తానంటూ నమ్మబలికి 200 మందికి టోకరా వేసిన ఓ వ్యక్తిని ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పొనుగంటివలసకు చెందిన రెడ్డి సందీప్‌  దొంగతనాల కేసుల్లో నిందితుడు. బెయిల్‌పై బయటికి వచ్చి కొత్త దందాకు తెరలేపాడు. కరోనా నుంచి కోలుకున్నానని, కావాలంటే తన ప్లాస్మా ఇస్తానంటూ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంలో ప్రచారంచేశాడు. కొవిడ్‌-19 బారిన పడ్డవారిని, వారి బంధువులకు ఫోన్‌చేసి ప్రయాణఖర్చులు అడిగేవాడు. కొవిడ్‌ యాంటీ వైరల్‌ డ్రగ్‌గా ఉపయోగించే టోసిలిజుంబ్‌-400 ఎంజీని కూడా ఇస్తానంటూ అడ్వాన్స్‌గా ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలుచేశాడు. ఇలా సుమారు 200 మందిని మోసంచేశాడు. దీంతో హైదరాబాద్‌లోని పలు పోలీసుస్టేషన్లలో బాధితులు సందీప్‌పై ఫిర్యాదుచేశారు. ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కే శ్రీనివాస్‌ నేతృత్వంలోని పోలీసుల బృందం నిందితుడిని సోమవారం అరెస్టుచేసి విచారణ నిమిత్తం పంజాగుట్ట పోలీసులకు అప్పగించింది. logo