శనివారం 11 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 00:53:01

15 క్వింటాళ్లనకిలీ పత్తి విత్తనాలు సీజ్‌

15 క్వింటాళ్లనకిలీ పత్తి విత్తనాలు సీజ్‌

  • ఫౌండేషన్‌ సీడ్స్‌ పేరుతో దందా  l 23 మంది అరెస్టు
  • వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ

రామగిరి: నల్లగొండ జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న  ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మొత్తం 23 మందిని అరెస్టు చేసి, రూ.30 లక్షల విలువైన 15 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. మునుగోడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గుర్తించిన నాలుగు పత్తి విత్తన ప్యాకెట్ల ఆధారంగా అంతర్రాష్ట్ర నకిలీ పత్తి విత్తనాల రాకెట్‌ను ఛేదించామన్నారు. ఏపీలోని నంద్యాల కేంద్రంగా ఫౌండేషన్‌ సీడ్స్‌ పేరుతో తయారైన నకిలీ విత్తనాలను నల్లగొండ జిల్లా చండూరు మండలంలో అమ్ముతున్నట్టు పక్కా సమాచారంతో కమ్మగూడెంకు చెందిన బాలస్వామి, నరేశ్‌ను అరెస్టు చేసి విచారించగా ముఠా గుట్టు రట్టయ్యిందని వివరించారు. నల్లగొండ, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో నకిలీ విత్తనాలు అమ్ముతున్న ముఠాను పట్టుకున్నామని తెలిపారు. 


logo