గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 20:47:41

సైబ్‌హ‌ర్‌లో భాగంగా ఫ్యాక్ట్ ఫ్రైడే

సైబ్‌హ‌ర్‌లో భాగంగా ఫ్యాక్ట్ ఫ్రైడే

హైద‌రాబాద్ : మ‌హిళ‌లు, చిన్నారుల‌కు సైబ‌ర్ నేరాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో భాగంగా రాష్ర్ట మ‌హిళా భ‌ద్ర‌త విభాగం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న‌ సైబ్‌హ‌ర్ కార్య‌క్ర‌మంలో నేడు ఫ్యాక్ట్ ఫ్రైడే నిర్వ‌హించారు. ఆన్‌లైన్ వినియోగిస్తున్న చిన్నారులు ఎన్ని విధాలుగా సైబ‌ర్ ముప్పులు ఎదుర్కొనే ప్ర‌మాదం ఉంద‌నే అంశాల‌పై సైబ‌ర్ నిపుణులు ఈ సంద‌ర్భంగా సూచ‌న‌లు చేశారు. సైబ‌ర్ చీట‌ర్స్ చిన్నారుల‌ను ట్రాప్ చేసేందుకు వాడే ప‌ద్ధ‌తుల‌ను వివ‌రించారు.

చిన్నారులకు శృంగార వీడియోలు, ఫోటోలు పంపించ‌డం,  మ‌హిళ‌లు, యువ‌తుల నుంచి వారి వ్య‌క్తిగ‌త ఏకాంత ఫోటోల‌ను సేక‌రించి వాటి ద్వారా బెదిరింపుల‌కు పాల్ప‌డే విధానాల‌ను వివ‌రించారు. సైబ‌ర్ స్టాకింగ్, లైంగిక వేధింపులు, యువ‌తుల‌ను గురించి పుకార్ల‌ను వ్యాప్తి చేస్తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డే సైబ‌ర్ బుల్లింగ్ వంటి ప్ర‌మాదాల‌పై శుక్ర‌వారం నాటి సైబ్‌హ‌ర్‌లో నిపుణులు చ‌ర్చించారు.


logo