శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 01:17:35

ఆర్మీలో సగం మందిలో తీవ్ర ఒత్తిడి

ఆర్మీలో సగం మందిలో తీవ్ర ఒత్తిడి

న్యూఢిల్లీ: భారత సైన్యంలోని సైనికుల్లో సగం కంటే ఎక్కువ మంది తీవ్ర ఒత్తిడితో బాధపడుతున్నట్టు మేథో సంస్థ యూనైటెడ్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. శత్రువుల దాడులతో పోలిస్తే.. నైరాశ్యంతో కూడిన ఆత్మహత్యల వల్లే ఎక్కువ మంది సైనికులు మరణిస్తున్నట్టు వెల్లడించింది. తిరుగుబాటుదార్లను, ఉగ్రవాదులను ఎదుర్కొనే సందర్భాల్లో సైనికులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు వెల్లడించింది.