శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 16:59:16

హన్మకొండ ఇన్‌స్పెక్టర్‌ దయాకర్‌పై దోపిడీ కేసు

హన్మకొండ ఇన్‌స్పెక్టర్‌ దయాకర్‌పై దోపిడీ కేసు

హన్మకొండ :  హన్మకొండ ఇన్‌స్పెక్టర్‌ దయాకర్‌పై పోలీసులు దోపిడీ కేసు నమోదు చేశారు. భూ వివాదాల్లో జోక్యం చేసుకున్న ఆయన రవీందర్‌ అనే వ్యక్తిని బెదిరించారు. బాధితుడు హన్మకొండ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేయడంతో దయాకర్‌పై కేసు నమోదైంది. దీంతో  ఆయనను వరంగల్‌ కమిషనరేట్‌కు అటాచ్‌ చేస్తూ వరంగల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ రవీందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుశాఖకు మచ్చతెచ్చే ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. తప్పుచేస్తే ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo