సోమవారం 01 మార్చి 2021
Telangana - Jan 16, 2021 , 20:55:40

గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి : సీఎస్‌

గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి : సీఎస్‌

హైదరాబాద్‌ :  గణతంత్ర వేడుకల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం బీఆర్‌కే భవన్‌లో వివిధశాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాలని, అన్నిశాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, బారికేడింగ్, వైద్య సిబ్బంది, మాస్కులు, శానిటైజేషన్‌ తదితర విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.

సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, రహదారులు, భవనాల శాఖ  ముఖ్యకార్యదర్శి  సునీల్ శర్మ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంజీ కమిషనర్ లోకేశ్ కుమార్, గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్,  హైదరాబాద్ బెటాలియన్స్, టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీపీ అభిలాశ్‌ బిష్త్, జాయింట్ సెక్రెటరీ ప్రొటోకాల్ అర్విందర్ సింగ్, కల్నల్ భూపేందర్ లెఫ్టినెంట్‌ కల్నల్ పవన్ కుమార్ అధికారులు పాల్గొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo