ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 12:14:11

ఆస్తి పన్ను బకాయిల చెల్లింపు గడువు పొడగింపు

ఆస్తి పన్ను బకాయిల చెల్లింపు గడువు పొడగింపు

హైదరాబాద్‌ : ఆస్తి పన్ను బకాయిల చెల్లింపు గడువును ప్రభుత్వం పొడగించింది. నవంబర్‌ 15వ తేదీ వరకు వన్‌ టైం స్కీమ్‌ గడువును పెంచింది. ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీమాఫీకి ఇదే చివరి అవకాశమని హైదరాబాద్‌ గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు బకాయిలు చెల్లించేందుకు అవకాశం ఉందని చెప్పారు. 2019-20 వరకు ఉన్న బకాయిలు కేవలం పది శాతం వడ్డీతో మాత్రమే చెల్లించేందుకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. 90శాతం పన్ను వడ్డీ మాఫీ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అవకాశాన్ని వినియోగించుకోవాలని లోకేశ్‌కుమార్‌ సూచించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.