ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 00:57:29

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ పొడిగింపు

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ పొడిగింపు

  • 19 నుంచి ఫస్ట్‌ ఫేజ్‌.. 
  • 29 నుంచి సెకండ్‌ ఫేజ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అనివార్య కారణాలతో వాయిదా పడిన ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను పొడిగిస్తూ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, టీఎస్‌ ఎంసెట్‌ కన్వీనర్‌ నవీన్‌మిట్టల్‌ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. సవరించిన కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించారు. తొలి విడుత కౌన్సెలింగ్‌ 19 నుంచి ప్రారంభం కానున్నది. ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ కాలేజీల్లో సీట్ల కోసం చేపట్టే స్పాట్‌ అడ్మిషన్‌ ప్రక్రియను నవంబర్‌ 4న చేపట్టనున్నారు. కళాశాలలు, ఫీజులు తదితర వివరాలకు టీఎస్‌ఎంసెట్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు పేర్కొన్నారు.logo