సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 22:45:13

పేలుడు పదార్థాలు స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

 పేలుడు పదార్థాలు స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

రంగారెడ్డి : అక్రమంగా పేలుడు పదార్ధాలు తరలిస్తున్న ఇద్దరిని మంచాల పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం బొడకొండ శివారులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని అనుమానించి నిలిపి తనిఖీ చేశారు. వీరి వద్ద 25 డిటోనేటర్ల, 70 జిలెటిన్‌ టిక్స్‌, మేగర్‌ బాక్స్‌, ఫ్యూజ్‌ వైర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. క్వారీలో బండరాళ్లను పగలగొట్టేందుకు వీటిని తీసుకెళ్తున్నట్లు నిందితులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.