మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 25, 2020 , 07:53:48

సిక్రిందాబాద్‌లో పేలుడు కలకలం

సిక్రిందాబాద్‌లో పేలుడు కలకలం

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద బాలానగర్‌ బస్టాండ్‌ సమీపంలో పేలుడు కలకలం సృష్టించింది. ఒక్కసారి భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ముత్యాలమ్మ ఆలయం వద్ద చెత్త డబ్బాలో పేలుడు చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. డబ్బాలో చెత్త ఏరుకుంటుండగా పేలుడు జరిగినట్లు సదరు వ్యక్తి పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేయిస్తున్నాయి. చెత్తకుప్పలో ఉన్న పెయింట్‌ డబ్బా పేలిందని పోలీసులు గుర్తించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.