గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 10:31:04

శివరాంపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద పేలుడు

శివరాంపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద పేలుడు

రంగారెడ్డి : జిల్లాలోని రాజేంద్రనగర్‌ శివరాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు ఇండ్ల కిటికీల అద్దాలు పగిలాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో జనసంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


logo