‘ఎక్స్ అఫీషియో’ పై వివరణ ఇవ్వడి

- జీహెచ్ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం
- మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు నిరాకరణ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోవటంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, చీఫ్ సెక్రటరీ, మున్సిపల్‌శాఖ, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులకు నోటీసులు జారీచేసింది. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో ఓట్లు రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. జీహెచ్ఎంసీ యాక్ట్ - 1955 సెక్షన్ 90 (1)ను కొట్టేయాలని, ఎక్స్అఫీషియో సభ్యులు ఓట్లు వేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరగా ధర్మాసనం నిరాకరించింది. తగిన విధంగా స్పందించడానికి ప్రతివాదులకు సమయం ఇవ్వాలి కదా? అని ప్రశ్నించింది. విచారణను నాలుగువారాలపాటు వాయిదా వేసింది.
తాజావార్తలు
- అనుష్క కెరీర్ డల్ అయిపోయిందా..?
- ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ఏసీబీ వలలో కుందనపల్లి వీఆర్వో
- సిరాజ్‌ను సన్మానించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- రిలయన్స్ 22-26 మధ్య డిజిటల్ ఇండియా సేల్.. డిస్కౌంట్లు.. ఆఫర్లు
- ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్లు లేవు..కారణమేంటో ?
- మహేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!
- ఏనుగు మరణం.. వెక్కివెక్కి ఏడ్చిన అటవీ రేంజర్
- సీతారామ ప్రాజెక్టు పనుల వేగవంతానికి సీఎం కేసీఆర్ ఆదేశం
- వచ్చీరాగానే వడివడిగా..