గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 21:43:03

కోవిడ్‌-19 నియంత్రణకు ఎక్స్‌పర్ట్‌ కమిటీ

కోవిడ్‌-19 నియంత్రణకు ఎక్స్‌పర్ట్‌ కమిటీ

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌పర్ట్‌ కమిటీని ఏర్పాటు చేసింది. కోవిడ్‌ -19ను నియంత్రిచడానికి వివిధ దేశాల్లో అనుసరించిన విధానాలతో పాటు, మన రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ కమిటీ సూచనలు ఇస్తుంది. కమిటీలో సీసీఎంబీ డైరెక్టర్‌ రకేశ్‌ కె. మిశ్రా, కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ కరుణాకర్‌రెడ్డి, ఐఐసీటీ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌, నిమ్స్‌ ప్రొఫేసర్‌ టి. గంగాధర్‌, హెచ్‌ఎంఆర్‌ఐ సీఈవో బాలాజీలు సభ్యులుగా ఉన్నారు. 


logo