శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 03, 2020 , 01:55:19

నిర్మాణరంగంపై నిపుణుల కమిటీ

నిర్మాణరంగంపై నిపుణుల కమిటీ

  • ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిర్మాణరంగంలో వలస కార్మికుల (స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ లేబర్‌) కొరతను అధిగమించాలని ఆర్‌అండ్‌బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. లాక్‌డౌన్‌ ముగిశాక ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నిర్మాణరంగ సంస్థలతో శనివారం మంత్రి సమావేశమయ్యారు. గల్ఫ్‌, ముంబై ప్రాంతాల నుంచి తిరిగి వచ్చే తెలంగాణ వలస కార్మికులతో ఆ కొరత పూడ్చుకోవాలన్నారు. రాష్ట్ర యువతకు న్యాక్‌ డీజీతోపాటు డైరెక్టర్‌ ట్రైనింగ్‌, నిర్మాణరంగ సంస్థల నుంచి కొందరు సభ్యులతో నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయించారు. 


logo