ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తలకిందులు

- జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాన్ని అంచనావేయటంలో విఫలం
- తుది ఫలితానికి సమీపంగా కూడా లేని ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు
- ఓటర్ల నాడి పట్టడంలో విఫలమైన సర్వే సంస్థలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్ల నాడి పట్టడంలో ఎగ్జిట్‌పోల్ సర్వే సంస్థలన్నీ విఫలమయ్యాయి. ఏ ఒక్క సంస్థ అంచనాలు కూడా వాస్తవ ఫలితాలకు దరిదాపుల్లో లేకపోవటం గమనార్హం. ఈ నెల 1న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలపై నాగన్న సర్వే, సీపీఎస్ సర్వే, పీపుల్స్ పల్స్, హెచ్ఎంఆర్, ఆరా, ఎన్ఎఫ్వో తదితర పదికిపైగా సంస్థలు ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించాయి. గురువారం ప్రకటించిన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో దాదాపు అన్ని సంస్థలు టీఆర్ఎస్ పార్టీ 68 నుంచి 101 స్థానాల్లో గెలుస్తుందని అంచనావేశాయి. కానీ శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్ 56 చోట్ల మాత్రమే గెలిచింది. బీజేపీకి 5 నుంచి 35 లోపే సీట్లు వస్తాయని సర్వే సంస్థలు అంచనావేయగా.. ఆ పార్టీ 49 చోట్ల గెలుపొందింది. దాంతో ఎగ్జిట్‌పోల్స్ సర్వేల విశ్వసనీయతపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి.
శాంపిల్స్ సేకరణలో తడబాటుతోనే..
గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 46.55 శాతం పోలింగ్ నమోదైంది. అయితే, సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ శాతం 30కి మించలేదు. ఆ తర్వాత రెండుగంటల్లోనే భారీగా పోలింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల మాత్రం మధ్యాహ్నానికే శాంపిల్ సేకరణను ముగించినట్టు తెలిసింది. దాంతో ఆ సంస్థలు అంచనాలు తప్పాయి. మరికొన్ని సంస్థలు పోలింగ్ రోజు కంటే ముందుగా ఉన్న అంచనాలకు అనుగుణంగా సర్వే ప్రకటించాయి. జాతీయ స్థాయిలోనూ ఇటీవలి కాలంలో పలు ఎన్నికల్లో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తప్పాయి. గత నెలలో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ గెలుస్తుందని సర్వేలన్నీ ప్రకటించాయి. కానీ అక్కడ ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలోని దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించగా ఫలితం అందుకు విరుద్ధంగా వెలువడింది.
తాజావార్తలు
- గంగా జలానికి తరలివెళ్లిన మెస్రం గిరిజనులు
- బాలకృష్ణ కోసం 'క్రాక్' డైరెక్టర్ పవర్ఫుల్ స్టోరీ..!
- సీరం ఇన్స్టిట్యూట్ అగ్నిప్రమాదంలో.. ఐదుగురు మృతి
- వర్క్ ఫ్రం హోం.. సైకిళ్లపై ముంబై టు కన్యాకుమారి
- నగర పోలీసుల వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్
- కోవిడ్ వ్యాక్సిన్ : ఆధార్ కీలకం
- నూరుశాతం గొర్రెల యూనిట్ల పంపిణీ
- రూ.190లకే లాపీ: అడ్డంగా బుక్కయిన అమెజాన్
- 'ఈ ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లదే'
- కోవిషీల్డ్ ఉత్పత్తికి ఎలాంటి నష్టం లేదు: సీరం సీఈవో