శనివారం 30 మే 2020
Telangana - May 14, 2020 , 06:37:04

దివ్యాంగ ఉద్యోగులకు విధుల నుంచి మినహాయింపు

దివ్యాంగ ఉద్యోగులకు విధుల నుంచి మినహాయింపు

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో దివ్యాంగులైన ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి మినహాయింపు కల్పించింది. ఈ మేరకు బుధవారం వికలాంగుల సంక్షేమశాఖ కార్యదర్శి డీ దివ్య ఉత్తర్వులు జారీచేశారు. గ్రీన్‌, ఆరెంజ్‌, రెడ్‌ జోన్లలో రవాణా సౌకర్యం లేక దివ్యాంగులైన ఉద్యోగులు కార్యాలయాలకు రావడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో వారికి మినహాయింపు ఇచ్చినట్టు పేర్కొన్నారు.


logo