బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 30, 2020 , 17:47:16

ఎక్సైజ్‌ సీల్‌ తొలగించి కల్తీ చేసి మద్యం అమ్మకాలు

ఎక్సైజ్‌ సీల్‌ తొలగించి కల్తీ చేసి మద్యం అమ్మకాలు

మంచిర్యాల : ఎక్సైజ్‌ అధికారులు వేసిన సీల్‌ను తొలగించి మద్యం బాటిళ్లను అక్రమంగా బయటకు తరలించి కల్తీ చేసి మరి ఎక్కువ ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్న వైనం మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యజమానులు సింగతి రవి, ప్రభాకర్‌ గడిచిన రాత్రి దుకాణానికి అధికారులు వేసిన సీల్‌ను తొలగించి తాళం పగలగొట్టి మద్యాన్ని అక్రమంగా బయటకు తరలించారు. పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తుల ఇళ్లలోకి ఈ మద్యాన్ని తరలించారు. అనంతరం ప్రశాంత్‌నగర్‌కు చెందిన మరో ఇద్దరికి రూ.40 వేల విలువైన మద్యం బాటిళ్లను ఇచ్చారు. వీరు సీసాల మూతలు తొలగించి అందులో కొంత మద్యానిన తీసి ఆమేరకు నీరు పోస్తూ కల్తీకి పాల్పడుతున్నారు. ఈ మద్యాన్ని నాలుగు రెట్లు ధరలు పెంచి అమ్ముతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రామగుండ టాస్‌ఫోర్స్‌ పోలీసులు రైడ్‌ చేసి మద్యం విక్రయదారులను పట్టుకున్నారు. మొత్తం ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కాగా బార్‌ యజమాని ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.


logo