మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 10, 2020 , 05:27:25

శాకాహారంలోనే కొవ్వెక్కువ!

శాకాహారంలోనే కొవ్వెక్కువ!
  • ఢిల్లీలో ఎక్కువగా అదనపు కొవ్వుల వినియోగం
  • ఈ జాబితాలో చివరిస్థానంలో హైదరాబాద్‌ నగరం
  • రోజువారీగా పురుషులు 34.1 గ్రాములు, మహిళలు 31.1 గ్రాముల వాడకం
  • సగటున ఢిల్లీలో 44.4 గ్రాములు, హైదరాబాద్‌లో 25.1 గ్రాములు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రోజువారీగా స్నాక్స్‌, పరాఠా, మటన్‌ బిర్యానీ వంటి ఆహార పదార్థాల రూపం లో అదనపు కొవ్వును వినియోగించడంపై అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబై మెట్రో నగరాల్లో ఐసీఎమ్మార్‌ సర్వే నిర్వహించింది. ఈ జాబితాలో ఢిల్లీ మొదటిస్థానంలో, హైదరాబాద్‌ చివరిస్థానంలో నిలిచింది. ఢిల్లీ నగరం లో అదనపు కొవ్వు పదార్థాల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. అక్కడ రోజు కు సగటున 44.4 గ్రాముల కొవ్వులను వివిధ రూపాల్లో తీసుకొంటుండగా..  43.9 గ్రాములతో రెండోస్థానంలో అహ్మదాబాద్‌ నిలిచింది. ముంబై, హైదరాబాద్‌ నగరాలు వరుసగా 28.8 గ్రాములు, 25.1 గ్రాముల వినియోగంతో చివరి రెండుస్థానాల్లో ఉన్నాయి. ఐసీఎమ్మార్‌ సూచించిన మేరకు మనం నిత్యం 20 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాల్సి ఉండగా.. ఆ స్థాయిని దాటి నట్టు అధ్యయనంలో తేలింది. 


పురుషులే ఫస్ట్‌

ఏడు మెట్రో నగరాల్లో సగటున మహిళల కంటే పురుషులే అధికంగా కొవ్వులను వినియోగిస్తున్నారు. మహిళలు 31.1 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకొంటుండగా, పురుషులు 34.1 గ్రాములు తింటున్నారు. దాల్‌ఫ్రై, అన్నం, పరాఠా, చుడువా వంటి ఆహారాల్లో కొవ్వు అధికంగా ఉంటున్నది. చికెన్‌ బిర్యానీ కంటే మటన్‌ బిర్యానీలోనే అధిక కొవ్వు ఉంటుందని స్పష్టమైంది. ఉడికించిన, మామూలుగా వేయించిన ఆహారం తినేవారి కంటే బాగా వేయించిన ఆహారం తినేవారిలోనే కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నదని అధ్యయనం పేర్కొన్నది. అదనపు కొవ్వులను వినియోగించేవారిలో 36 ఏండ్ల నుంచి 59 ఏండ్లలోపువారే అధికంగా ఉన్నారు. వీరు సగటున రోజుకు 36.1 గ్రాములు తీసుకొంటుండగా.. 18 ఏండ్ల నుంచి 35 ఏండ్లలోపువారు సగటున 32.8 గ్రాముల అదనపు కొవ్వులను వినియోగిస్తున్నారు. 


నిత్యం వినియోగం పురుషులు: 34.1 గ్రాములు మహిళలు: 31.1 గ్రాములు

36 ఏండ్ల నుంచి 59 ఏండ్లలోపువారు సగటున రోజుకు 36.1 గ్రాములు

18 ఏండ్ల నుంచి 35 ఏండ్లలోపువారు సగటున రోజుకు 32.8 గ్రాములు

ఐదేండ్లలోపు పిల్లలు సగటున రోజుకు 15.7 గ్రాముల అదనపు కొవ్వులు

దాల్‌ఫ్రై, అన్నం, పరాఠా, చుడువాలో అధికంగా కొవ్వులు

చికెన్‌ బిర్యానీ కంటే మటన్‌ బిర్యానీలోనే కొవ్వెక్కువ

బాగా వేయించిన ఆహారం తినేవారిలో కొవ్వు శాతం అధికం


logo
>>>>>>