శనివారం 30 మే 2020
Telangana - Apr 01, 2020 , 00:42:12

పరిశ్రమలకు మినహాయింపులు ఇవ్వాలి

పరిశ్రమలకు మినహాయింపులు ఇవ్వాలి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిశ్రమలకు మినహాయింపులు ప్రకటించాలని తెలంగాణ పరిశ్రమల సమాఖ్య (టీఐఎఫ్‌).. పరిశ్రమలశాఖ కమిషనర్‌ను కోరింది. టీఐఎఫ్‌ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి మంగళవారం కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. విద్యుత్‌, ఆస్తి, నీటిపన్నుపై మారటోరియం విధించాలని విజ్ఞప్తిచేశారు.  

లైసెన్స్‌ కాలపరిమితి పొడిగించండి

కరోనావైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో హోటల్‌ రంగం కుదేలైందని, ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం తమకు కొన్ని మినహాయింపులు ఇచ్చి ఆదుకోవాలని హైదరాబాద్‌ సిటీ హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కంచర్ల అశోక్‌రెడ్డి  కోరారు.


logo