ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 13:31:29

వికారాబాద్‌లో గుప్త నిధుల కలకలం

వికారాబాద్‌లో గుప్త నిధుల కలకలం

హైదరాబాద్‌ : వికారాబాద్‌ జిల్లా దోమ మండలం గుండాల్‌లో గుప్త నిధుల తవ్వకం ఘటన కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి ఓ రైతు పొలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి వెళ్లారు. ఈ సందర్భంగా తవ్వకాలకు పాల్పడిన ముఠాలోని వ్యక్తిని పట్టుకున్నారు. సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు బంగారు వినాయకుడి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విగ్రహంతో పాటు ఆభరణాలు సైతం ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


logo