మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 18, 2020 , 02:46:23

కారు.. ఎక్స్‌అఫీషియో జోరు

కారు.. ఎక్స్‌అఫీషియో జోరు

బల్దియాలో కారు, పతంగిదే హవా

జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎం మినహా ఇతరపార్టీల ప్రభావం నామమాత్రమేనని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 99 కార్పొరేట్‌ స్థానాలను గెలుచుకొని తిరుగులేని ఆధిక్యతతో మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకున్న విషయం విదితమే. టీఆర్‌ఎస్‌కు మజ్లిస్‌ పార్టీ కూడా మద్దతు తెలుపడంతో ఇతర పార్టీల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. స్థాయీసంఘం సమావేశాల్లోనూ, సర్వసభ్య సమావేశాల్లోనూ తీర్మానాలన్నీ ఏకగ్రీవమయ్యాయి. దీంతో అభివృద్ధి కార్యక్రమాల అమలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోయింది.

జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫీషియో సభ్యులు

రాజ్యసభ సభ్యులు -2

కే కేశవరావు, డీ శ్రీనివాస్‌ (టీఆర్‌ఎస్‌)

లోక్‌సభ సభ్యులు-5

కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌), అసదుద్దీన్‌ ఒవైసీ (ఎంఐఎం), రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్‌), కిషన్‌రెడ్డి (బీజేపీ).

ఎమ్మెల్సీలు- 20

భూపాల్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, పురాణం సతీశ్‌కుమార్‌, మహమూద్‌అలీ, కసిరెడ్డి నారాయణరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్‌రావు, ఎమ్మెస్‌ ప్రభాకర్‌రావు, నారదాసు లక్ష్మణ్‌రావు, యెగ్గె మల్లేశం, కే నవీన్‌రావు (టీఆర్‌ఎస్‌), అమీన్‌ఉల్‌ జాఫ్రీ, మిర్జా రియాజ్‌ ఉల్‌ హసన్‌ (ఎంఐఎం), రామచందర్‌రావు (బీజేపీ), శ్రీనివాస్‌రెడ్డి, దర్పల్లి రాజేశ్వర్‌రావు, దయానంద్‌, గోరటి వెంకన్న, సారయ్య(గవర్నర్‌ నామినేటెడ్‌), జనార్దన్‌రెడ్డి (స్వతంత్ర).

ఎమ్మెల్యేలు- 25

ముఠా గోపాల్‌, కాలేరు వెంకటేశ్‌, దానం నాగేందర్‌, మాగంటి గోపీనాథ్‌, తలసాని, పద్మారావు, జీ సాయన్న, మహిపాల్‌రెడ్డి, హనుమంతరావు, వివేకానంద్‌, మాధవరం కృష్ణారావు, సుభాశ్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, సబితారెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, అరికెపూడి గాంధీ (టీఆర్‌ఎస్‌), స్టీఫెన్‌సన్‌ (నామినేటెడ్‌), అహ్మద్‌బిన్‌ బలాలా, జాఫర్‌ హుస్సేన్‌, కౌసర్‌ మొయినుద్దీన్‌, ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌, అహ్మద్‌పాషా, అక్బరుద్దీన్‌ ఒవైసీ, మోజంఖాన్‌ (ఎంఐఎం), రాజాసింగ్‌ (బీజేపీ).