బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 27, 2020 , 15:05:37

కరోనా కట్టడిలో తెలంగాణ దేశానికి స్ఫూర్తి

కరోనా కట్టడిలో తెలంగాణ దేశానికి స్ఫూర్తి

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో వైద్యులు, మెడికల్‌, పారిశుద్ధ్య సిబ్బంది, మీడియా, పోలీసులు, ఉద్యోగులు, ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను తుదముట్టించే దాకా ఎవరూ కూడా విశ్రమించకూడదని ఆయన పిలుపునిచ్చారు. ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనాను దూరం చేసుకున్నట్లే అని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత కూడా ముఖ్యమేనని ఆయన చెప్పారు. కఠినతర స్వీయ నియంత్రణే మానవాళికి శ్రీరామరక్ష అనే వాస్తవాన్ని ఎవరూ కూడా విస్మరించవద్దని వినోద్‌ విజ్ఞప్తి చేశారు. 

కరోనా వ్యాప్తి చెందకుండా గ్రామాల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, యువజన సంఘాలు, మహిళలు, ప్రజలు విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. కరోనా మహమ్మారిని అంతమొందించే వరకు ఇదే స్ఫూర్తిగా గ్రామాల్లో, పట్టణాల్లో కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో అమలు చేస్తున్న కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని వినోద్‌ కుమార్‌ తెలిపారు. 


logo
>>>>>>