శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 01:52:33

ఇది పరీక్ష సమయం

ఇది పరీక్ష సమయం

  • స్వీయ నియంత్రణతో ఇండ్లలో ఉండండి: మాజీ ఎంపీ కవిత

హైదరాబాద్‌, నమస్తే తెలం గాణ: కరోనా మహమ్మారి ప్ర పంచాన్ని వెంటాడుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరికి ఇది పరీక్ష సమయమని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నాకేమవుతుందిలే అనే నిర్లక్ష్యానికి పోవొద్దని చెప్పారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ స్వీయ నియం త్రణతో మనందరం ఇండ్లలో ఉండటమే శ్రేయస్కరమని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు వీడియో సం దేశం ద్వారా బుధవారం ఆమె ఉగాది శుభాకాంక్షలు తెలిపా రు. శార్వరి నామసంవత్సరం అందరి కుటుంబాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. పండుగనాడు కూడా కుటుంబాలను వదిలేసి సమా జ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న డాక్టర్లు, శానిటేషన్‌ సిబ్బంది, పోలీసుశాఖ సహా ఇతర శాఖల సిబ్బంది కుటుంబసభ్యు లకు ఆమె ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.  


logo