శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 04, 2020 , 16:54:59

కవిత చొరవతో స్వస్థలాలకు యువత

కవిత చొరవతో స్వస్థలాలకు యువత

నిజామాబాద్: మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతో తెలంగాణకు చెందిన కొందరు యువతీ, యువకులు మహారాష్ట్ర నుంచి స్వస్థలాలకు చేరుకున్నారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి ‌నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 25 మంది యువతులు, ఐదుగురు యువకులు సోమవారం వారి స్వస్థలాలకు చేరుకున్నారు. వారంతా ‌శిక్షణ నిమిత్తం కొన్ని నెలల క్రితం మహారాష్ట్రలోని అమరావతికి వెళ్లారు. అయితే ఇంతలో లాక్డౌన్ అమల్లోకి రావడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. రోజులు గడుస్తున్నా కొద్ది వారి గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండటంతో తెలంగాణకు రావడానికి సాయం చేయాలని మాజీ ఎంపీ కవితను కోరారు. వారి అభ్యర్థనపై వెంటనే స్పందించిన కవిత 30 మందికి బస్సు ఏర్పాటు చేసి, భోజన సదుపాయం కల్పించారు. శనివారం బయలురేరిన వారంతా సోమవారం ఉదయానికి స్వస్థలాలకు చేరుకున్నారు. అనంతరం వారు హోమ్ క్వారంటైన్లో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. కాగా, తమకు సాయపడ్డ కవితకు యువతీ యువకులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.


logo