మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 04, 2020 , 10:55:03

సున్నం రాజయ్య మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం

 సున్నం రాజయ్య మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌:  మాజీ  ఎమ్మెల్యే , సీపీఎం  సీనియర్ నాయకుడు  సున్నం రాజయ్య మరణం పట్ల  ముఖ్యమంత్రి  కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం కృషి చేసిన రాజయ్య, అత్యంత నిరాడంబర రాజకీయ నాయకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచి పోతారని సీఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్య  ఇటీవల  కరోనా పరీక్షలు చేయించుకున్నారు.  ఫలితం  కరోనా పాజిటివ్‌గా రావడంతో విజయవాడ దవాఖానకు తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ  కన్నుమూశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో మూడుసార్లు ఆయన సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.


logo