శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 01:46:55

ఏపీ మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు కన్నుమూత

ఏపీ మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు కన్నుమూత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్‌ (59) కన్నుమూశారు. ఇటీవల కరోనా సోకడంతో వైజాగ్‌లోని ఓ దవాఖానలో చేరిన ఆయన ఊపిరితిత్తులు దెబ్బతినడంతో చికిత్సపొందుతూ ఆదివారం సా యంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్ధం నగరంలోని పెద్దవాల్తేరు డాక్టర్స్‌కాలనీలోని ఆయన నివాసం వద్ద ద్రోణంరాజు పార్థివదేహాన్ని ఉంచనున్నారు. సోమవారం మధ్యా హ్నం మూడుగంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు శ్రీవాస్తవ తెలిపారు. ద్రోణంరాజు విశాఖ వన్‌టౌన్‌ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన విశా ఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా ఉన్నారు. సీనియర్‌నేత, మాజీ ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడైన శ్రీనివాస్‌.. తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. శ్రీనివాస్‌కు భార్య శశి, కుమార్తె శ్వేత, కు మారుడు శ్రీవాస్తవ ఉన్నారు. ద్రో ణంరాజు మృతికి ఏపీ సీఎం జగన్‌తోపాటు పలువు రు మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు సంతాపం తెలిపారు. 

స్వరూపానందేంద్ర సంతాపం

ద్రోణంరాజు మృతిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సంతా పం తెలిపారు. మంచి రాజనీతిజ్ఞుడిని విశాఖ నగరం కోల్పోయిందని పేర్కొన్నారు. చివరివరకు విలువలతో కూడిన రాజకీయాలతోనే జీవించారన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెద్దపీటవేసే ద్రోణంరాజు కుటుంబంతో విశాఖ శారదాపీఠానికి విడదీయరాని అనుబంధం ఉన్నదన్నారు. వారి కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని రాజశ్యామల అమ్మవారిని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.