గురువారం 04 జూన్ 2020
Telangana - May 10, 2020 , 09:24:54

మాజీ మంత్రి జవ్వాడి రత్నాకర్‌రావు మృతి

మాజీ మంత్రి జవ్వాడి రత్నాకర్‌రావు మృతి

జగిత్యాల: మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జువ్వాడి రత్నాకర్‌రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున మరణించారు. మూడు సార్లు బుగ్గారం ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

తిమ్మాపూర్‌ సర్పంచిగా రత్నాకర్‌ తన రాజయకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1982లో జగిత్యాల పంచాయతి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1982లో జరిగిన ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యే స్థానానికి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. 1989లో పార్టీ టికెట్‌ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి బుగ్గారం నుంచి తొలిసారి గెలుపొందారు. 1994లో ఓడిపోయిన ఆయన, 1999, 2004లో బుగ్గారం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2010లో కోరుట్ల నుంచి పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.


logo