ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Oct 22, 2020 , 01:00:21

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి మృతి

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి మృతి

హైదరాబాద్‌ : మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి (80) కన్నుమూసారు. జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌లో గత కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటూ నాయిని మృతి చెందారు. గత నెలలో నాయిని నర్సింహారెడ్డి కరోనా వైరస్ బారినపడి కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత శ్వాస సంబంధ సమస్యలకు గురయ్యారు. వైద్య పరీక్షల్లో న్యూమోనియా అని తేలింది. కరోనా కారణంగా కలిగిన న్యూమోనియాతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాయిని ఆసుపత్రి పాలు అయ్యారు. ఆయన ఆరోగ్యంగా కోలుకుని తిరిగి వస్తారనే ప్రజలు అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణ వార్త ఆయన అభిమానులను, పార్టీ శ్రేణులను తీవ్ర భాదలోకి నెట్టివేసింది.