e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home తెలంగాణ సన్యాసం స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే

సన్యాసం స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే

సన్యాసం స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (నమస్తే తెలంగాణ): రాజకీయ సన్యాసం.. రాజకీయ నాయకుల నోట మనం తరచూ వినే మాట. అంతా అనడమే తప్ప ఇప్పటివరకు ఎవరూ స్వీకరించిన దాఖలా లు లేవు. కానీ ఓ మాజీ ఎమ్మెల్యే మాత్రం నిజంగానే సన్యాసం పుచ్చుకున్నారు. తన ప్రత్యర్థులకు సవాలు ఏమీ విసరలేదు కానీ.. ఆధ్యాత్మిక చింతనలో భాగంగా ఆయన సన్యాసిగా మారారు. ఆయనే ఏపీలోని కడప జిల్లా బద్వేల్‌ మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణారావు. శనివారం రాజమండ్రి పుష్కరఘాట్‌ వద్ద శాస్ర్తోక్తంగా గురువుల మధ్య సన్యాసం స్వీకరించారు. దీంతో ఇకపై ఆయన స్వామి శివరామానంద సరస్వతిగా కొనసాగనున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సన్యాసం స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే

ట్రెండింగ్‌

Advertisement