ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించొచ్చు: హరీశ్ రావు

సిద్దిపేట: అసాధ్యమంటూ ఏదీ లేదని.. ఆత్మ విశ్వాసంతో ఏదైనా సాధించొచ్చని మంత్రి హరీశ్ రావు అన్నారు. నిరంతర ప్రయత్నం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. ఇంటర్ విద్యాశాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలీసు నియామక ఉచిత శిక్షణా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 34 ఉచిత పోలీస్ శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తు న్నామని చెప్పారు.
జిల్లాలో 2015 నుంచి పోలీస్ ఉద్యోగాలతో పాటు ఇతర ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నామన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన చాలా మంది ఉద్యోగాలు సాధించారని వెల్లడించారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగాలే కాకుండా జాతీయ స్థాయిలో వచ్చే ఉద్యోగాలకు కూడా ప్రయత్నించాలని సూచించారు. శిక్షణకు క్రమం తప్పకుండా హాజరైతే స్టడీ మెటీరియల్‌తోపాటు, టిఫిన్, స్పోర్ట్స్ మెటీరియల్, యూనిఫాం తదితర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. విద్యార్థులు నిర్లక్ష్యం చేయ కుండా, మంచి సాధనతో ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు.
తాజావార్తలు
- పార్కుల అభివృద్ధికి చర్యలు
- పేదల సంక్షేమానికి పెద్దపీట
- బ్యాంకింగ్‌లోకి కార్పొరేట్లకు అనుమతి మంచిదే: ఆదిత్యపూరీ
- చిత్తారమ్మ జాతరకు సర్వం సిద్ధం
- ఆరు దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తాం: మోదీ సంకేతాలు
- ‘గ్రాజియా’ ఫీచర్స్...అదుర్స్...!
- 27న జైలు నుంచి శశికళ విడుదల
- బ్యాంకర్లు, ఎన్బీఎఫ్సీలతో టాటా టైఅప్.. అందుకేనా?!
- హాస్పిటల్లో ‘RRR’ హీరోయిన్ అలియా భట్..!
- సార్క్ దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ : విదేశాంగ శాఖ