గురువారం 02 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 14:22:29

హరిత ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి : మంత్రులు

హరిత ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి : మంత్రులు

హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారంలో భాగంగా గిరిజన విద్యాలయాల్లో 4,60,000 మొక్కలను ఈ ఒక్క రోజే నాటుతున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇందులో భాగంగా రాజేంద్ర నగర్, ఐఏఎస్ స్టడీ సర్కిల్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఈ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించేందుకు మొక్కలు నాటాలన్నారు.విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాలయాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడంపై ఆ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఆ శాఖ అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. హరితహారం కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సాంఘిక, గిరిజన గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, గిరిజన గురుకులాల ఉప కార్యదర్శి నవీన్ నికోలస్, ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఇంచార్జి సీతారాం నాయక్, ఇతర స్థానిక అధికారులు, నేతలు పాల్గొన్నారు.


logo