గురువారం 09 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 11:27:00

ఢిల్లీలాంటి దుస్తితి ఊర్లకు రావొద్దు: మంత్రి పువ్వాడ

ఢిల్లీలాంటి దుస్తితి ఊర్లకు రావొద్దు: మంత్రి పువ్వాడ

సత్తుపల్లి: వాతావరణ కాలుష్యంతో ఢిల్లీ లాంటి పట్టణాల్లో ఇప్పటికే ఆక్సిజన్‌ కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని, పల్లెల్లో ఆ దుస్తితి రాకుండా ఉండాలంటే ప్రతిఒక్కరు మొక్కలు నాటాలని మంత్రి పువ్వాడ అజయ్‌ పిలుపునిచ్చారు. ఆరోవిడత హరితహారంలో భాగంగా ఆయన సత్తుపల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు కోట్ల మొక్కలు నాటుతామని వెల్లడించారు. 

మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల ఆదాయంలో 10 శాతం నిధులు మొక్కల పెంపకానికి వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్‌ చట్టం చేశారాని అన్నారు. అడవులు తగ్గిపోవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని చెప్పారు. మైనింగ్‌ వల్ల వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని చెప్పారు. మొక్కను నాటి ఏడాదిపాటు కాపాడితే అది మనల్ని 50 ఏండ్లపాటు రక్షిస్తుందని చెప్పారు. అర్బన్‌ పార్క్‌, సృ్మతి వనం వల్ల సత్తుపల్లి హరితవనంగా మారాలన్నారు.


logo