మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 13:03:54

గ్రీన్ ఫ్రైడేలో అందరూ పాల్గొనాలి

గ్రీన్ ఫ్రైడేలో అందరూ పాల్గొనాలి

హైదరాబాద్‌: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ  పరిసరాల పరిశుభ్రత పాటించాలని  రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. ప్రతి ఫ్రైడేను డ్రైడేగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో పరిసరాలను శుభ్రం చేశారు.

పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చేసుకోవాలని, దోమలు వ్యాప్తి చెందకుండా పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తే పర్యావరణం ప్రజలను కాపాడుతుందని పేర్కొన్నారు.  హరితహారంలో చెట్లను నాటుతూనే ఫ్రైడేని డ్రైడే గా, గ్రీన్ ఫ్రైడేగా పాటించి హరిత తెలంగాణలో భాగస్వామ్యం కావాలని కోరారు. రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ కచ్చితంగా ధరిస్తూ జాగ్రత్తలు పాటించాలన్నారు.  ఈ సందర్భంగా  నివాసంలో చెట్ల పొదల వద్ద నీటి నిల్వలు లేకుండా, దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉండే మురుగు లేకుండా మంత్రి సత్యవతి శుభ్రం చేశారు. 


logo