‘ఎస్ఎంఎస్’ను జీవితంలో భాగంగా చేసుకోవాలి: సీపీ

హైదరాబాద్: ప్రస్తుత కరోనా కాలంలో అందరూ ఎస్ఎంఎస్ను జీవితంలో భాగంగా చేసుకోవాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. ఎస్ఎంఎస్ అంటే శానిటైజర్ (ఎస్), మాస్క్ (ఎం), సోషల్ డిస్టెన్స్ (ఎస్) అని చెప్పారు. కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ హెచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ చౌరస్తాలో జరిగిన 10కే రన్‌ను సీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిఒక్కరు కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసులు చాలా వరకు తగ్గాయని చెప్పారు. అయితే మళ్లీ కొత్తగా కేసులు వస్తున్నాయని వెల్లడించారు.
పోలీసు సిబ్బందిలో 1058 మందికి కరోనా వచ్చిందని, అందరూ కోలుకున్నారని తెలిపారు. హెచ్ ఫౌండేషన్ వాళ్లు ఈ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని చెప్పారు. లాక్డౌన్ సమయంలో కూడా సేవా కార్యక్రమాలు చేశారన్నారు. పోలీసు సిబ్బందికి కూడా మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారని అభినందించారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ సభ్యులు, పోలీసులు భారీగా తరలివచ్చారు. దీంతో ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్‌ను మల్లించారు.
తాజావార్తలు
- ముగియనున్న ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ దరఖాస్తు గడువు
- వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు