శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 01:18:09

లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలి: పవన్‌ కళ్యాణ్‌

లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలి: పవన్‌ కళ్యాణ్‌

హైదరాబాద్‌: ప్రధాని మోదీ ఇవాళ జాతినుద్ధేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని దేశప్రజలకు పలు సూచనలు చేశారు. కరోనా నివారించేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు తెలిపారు. మనల్ని మనం రక్షించుకోవాలంటే ఈ సూచన తప్పకుండా పాటించాలని తెలిపారు. కాగా, ప్రధాని చెప్పిన సూచనలు తప్పకుండా పాటించాలని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. 

లాక్‌డౌన్‌ పట్ల పవన్‌ మాట్లాడుతూ.. దేశ బాగుకోసం ప్రధాని చెప్పినట్లు ప్రజలంతా లాక్‌డౌన్‌ను విధిగా పాటించాలాన్నారు. ఈ అర్ధరాత్రి నుంచి మొదలయ్యే.. లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించాలని పవన్‌ విన్నవించారు. ఇప్పటికే దేశంలో కరోనా బాధితులున్నారనీ.. ఈ సంఖ్య పెరగకుండా ఉండేందుకు ఇదే సరైన నిర్ణయమన్నారు. కరోనా మహమ్మారి ఎదుర్కొనేందుకు వేరే మార్గం లేదనీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలని పవన్‌ తెలిపారు.

దయచేసి అందరూ ఇంటికే పరిమితమవ్వాలనీ.. ఈ విలువైన సమయాన్ని కుంటుంబంతో గడపాలన్నారు. ప్రభుత్వాల సూచనలు పాటించి దేశాన్ని రక్షించుకుందామని పవన్‌ విన్నవించారు.logo