శనివారం 30 మే 2020
Telangana - Apr 10, 2020 , 11:29:41

పూలే జయంతిని ఇళ్లలోనే జరుపుకోవాలి

పూలే జయంతిని ఇళ్లలోనే జరుపుకోవాలి

హైదరాబాద్‌ : భారత సామాజిక వ్యవస్థా పరిణామానికి ధృవతార జ్యోతిరావు పూలే. పూలే 193వ జయంతి రేపు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే జయంతిని ఇళ్లలోనే జరుపుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం తెలిపారు. రేపు నిర్వహించుకునే పూలే జయంతిలో సామాజిక దూరం పాటించాలన్నారు. సమావేశాలు, సమూహాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జిల్లాల కలెక్టర్లు ఈ ఉత్తర్వులను పాటించాలని ఆయన పేర్కొన్నారు.


logo