మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 18:35:07

అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి

అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి

మహబూబ్‌నగర్‌ : పట్టణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని, పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని ఆబ్కారీ, క్రీడల, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్‌లో రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్డు విస్తరణతో ట్రాఫిక్‌ సమస్య తీరడంతో పాటు పట్టణానికి కొత్త కళ వస్తుందన్నారు. 

బైపాస్‌ రోడ్డుతో పాటు పట్టణంలో ప్రతి వార్డులో సీసీ, డ్రైనేజీ, బీటీ రోడ్డు వేశామని తెలిపారు. పార్టీలకు అతీతంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారని తెలిపారు. ఏమైనా విభేదాలు ఉంటే పక్కన పెట్టి అభివృద్ధిలో అందరూ పాలుపంచుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. మంత్రి వెంట కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.


logo