మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 20:28:04

వ్యాక్సినేషన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలి

వ్యాక్సినేషన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలి

కరీంనగర్‌ : కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్‌ జిల్లాలో వ్యాక్సినేషన్‌కు జరుగుతున్న ఏర్పాట్లపై ఆయన కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న రాష్ట్రమంతటా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమవుతున్నదని, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధులందరూ సహకరించాలని కోరారు.

మొదటి ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో పనిచేస్తున్న హెల్త్‌ కేర్‌ వర్కర్లు, అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తలకు టీకాలు ఇస్తారని, ఇలాంటి వారు జిల్లాలో 12,419 మంది ఉన్నారని మంత్రి వెల్లడించారు. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ఇదీ పూర్తిగా సురక్షితమైనదని ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్‌ పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.  కార్యక్రమంలో కలెక్టర్‌ కే శశాంక, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, రసమయి బాలకిషన్‌, మేయర్‌ వై సునీల్‌రావు ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

ఐలోని జాతరకు పోటెత్తిన భక్త జనం..

విహారంలో విషాదం..ముగ్గురి దుర్మణం 

వ్యవసాయ బావిలో చిరుతపులి..

సాగు చ‌ట్టాల కాపీల‌ను త‌గులబెట్టిన రైతులు

తుపాకీ కాల్పుల్లో ఇండిగో మేనేజర్‌ మృతి 

పిచ్చిగా మాట్లాడొద్దు.. ప్రజలని రెచ్చగొట్టొద్దు 


logo