ఆదివారం 17 జనవరి 2021
Telangana - Jan 11, 2021 , 01:19:19

ఎన్నికలకు అందరూ సహకరించాలి: నిమ్మగడ్డ

ఎన్నికలకు అందరూ సహకరించాలి: నిమ్మగడ్డ

హైదరాబాద్‌, జనవరి 10 (నమస్తే తెలంగాణ): గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ విజ్ఞప్తిచేశారు. ఎన్నికల నిర్వహణను వాయి దా వేయాలని ఏపీ ఉద్యోగ సంఘాల అభ్యంతరాలపై రమేశ్‌ ఆదివారం స్పందించారు. ఏపీ ఉద్యోగులకు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణలో ఉద్యోగుల అభ్యంతరాలు తమ దృష్టికి వచ్చాయని, పీపీఈకిట్లు, ఫేస్‌ షీల్డ్‌, శానిటైజర్‌ ఇవ్వాలని సూచించామని తెలిపారు. వ్యాక్సినేషన్‌లో పోలింగ్‌ సిబ్బందికి ప్రాధా న్యం ఇవ్వాలని కోరామని లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం గ్రామ పంచాయతీలకు నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు.