మంగళవారం 07 జూలై 2020
Telangana - May 28, 2020 , 11:33:19

అందరికి ఇండ్లు..అదే సీఎం కేసీఆర్ లక్ష్యం

అందరికి ఇండ్లు..అదే సీఎం కేసీఆర్ లక్ష్యం

సూర్యాపేట : రాష్ట్రంలో ఇండ్లు లేకుండా ఏ ఒక్కరూ ఉండకూడదన్నసీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగాణ పని చేస్తున్నామని  విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద రూ. 5 కోట్ల 8 లక్షల అంచనా వ్యయం తో నిర్మించిన 80 డబుల్ బెడ్ రూం ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్నముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం మేరకే ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని విధిగా అమలు పరిచేందుకు అడుగులు పడుతున్నాయని ఆయన తెలిపారు.

గుంపుల తిరుమలగిరిలో ఏకకాలంలో 80 మంది లబ్ధిదారులు గృహప్రవేశం జరుపుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. డబుల్ ఇండ్ల నిర్మాణం నాణ్యతలో ఎటువంటి రాజీ లేదని, అదే సమయంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం జరిగిన కాలనీలు రోల్ మోడల్ గా ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. లబ్ధిదారులు విధిగా మొక్కలు పెంచేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


logo