శనివారం 30 మే 2020
Telangana - May 18, 2020 , 16:44:34

ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు రావాలి

ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు రావాలి

హైదరాబాద్‌ : ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు వచ్చి ఆకలితోన ఉన్న వారికి సాయం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డిలో ఎస్డీపీసీఎల్‌ తరఫున 1250‌ విద్యుత్ ఉద్యోగులు కాంట్రాక్టు కార్మికులకు నెలకు సరిపడా  నిత్యావసర సరుకులు‌ అందజేయడం హర్షనీయమన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా సమయంలో 24 గంటలు కోతలు‌ లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్న విద్యుత్ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దేశమంతా‌ కరెంటు‌ కోతలున్నా తెలంగాణలో కనురెప్ప పాటు కోత‌ లేకుండా అందజేస్తున్నామన్నారు.

రైతులకు, పరిశ్రమలకు, గృహావసరాలకు‌ 24 గంటలు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. పట్టణ ప్రగతిలో నారాయణరెడ్డి కాలనీలో 30 ఏండ్ల నుంచి సమస్యగా ఉన్న విద్యుత్ టవర్లు తొలగించాలని ప్రజలు కోరితే..15 రోజుల్లో డీఈ రమేష్ చంద్ర నేతృత్వంలో విద్యుత్ సిబ్బంది టవర్లను తీసివేశారని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 


logo