శనివారం 06 జూన్ 2020
Telangana - May 09, 2020 , 12:53:35

ఇంట్లో కూర్చొనే లాభ 'ఫలం' : ఎంపీ సంతోష్‌ కుమార్‌

ఇంట్లో కూర్చొనే లాభ 'ఫలం' : ఎంపీ సంతోష్‌ కుమార్‌

హైదరాబాద్‌ : తెలంగాణ బత్తాయి డే లో భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ అన్నారు. బత్తాయి డే పై ట్విట్టర్‌ ద్వారా ఎంపీ స్పందిస్తూ... ఇగ్నైటెడ్‌ మైండ్స్‌ తెలంగాణ బత్తాయి డే  పేరుతో అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో తనను భాగస్వామిని చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. బత్తాయి రైతులకు మద్దతుగా రేపు రాష్ట్రంలో తెలంగాణ బత్తాయి డే ను నిర్వహిస్తున్నారన్నారు. వీరందరికి మనం మద్దతు తెలపాల్సిందిగా పేర్కొన్నారు. అందరికి తెలిసేలా బత్తాయి డే నిర్వహణను గురించి ప్రచారం చేయాలని తద్వారా ఇంట్లో కూర్చొనే ప్రతిఒక్కరూ ప్రయోజనం పొందవచ్చన్నారు. 

రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో బత్తాయిని అధికంగా సాగు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా కరోనా ఈ ఏడాది బత్తాయి రైతును గట్టి దెబ్బ కొట్టింది. ఎగుమతులకు, అమ్మకాలకు అవకాశాలే లేకుండా పోయాయి. దీంతో మన దగ్గర పండిన పండ్లను స్థానికంగా మనమే కొనుక్కొని రైతులకు అండగా నిలుద్దామన్న బృహత్‌ సంకల్పంతో వాక్‌ ఫర్‌ వాటర్‌ సంస్థ ఈ ఫెస్టివల్‌ను లీడ్‌ చేస్తున్నది. ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బత్తాయి ఫెస్టివల్‌ ఆన్‌లైన్‌ వేదికగా సాగుతుంది. దీంట్లో భాగంగా మే 10న అంటే రేపు 20 కిలోల బత్తాయిలను రూ. 500కే అందించనున్నారు. బత్తాయి ప్రియులు చేయాల్సిందిల్లా 88753 51555 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇచ్చి ఆర్డర్‌ను నమోదు చేసుకోవడమే. బత్తాయిలో రోగనిరోధకశక్తి దండిగా ఉంటుంది కావునా తెలంగాణవాసులు పెద్దమొత్తంలో ఈ పండ్లను తినడం ద్వారా కరోనాను తరిమికొట్టే శక్తిని సమకూర్చుకోవచ్చని రాష్ట్ర సీఎం కేసీఆర్‌ సైతం పేర్కొన్న విషయం తెలిసిందే.


logo