సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 14:56:58

ప్రతి పల్లె ప్రకృతి వనం కావాలి : మంత్రి పువ్వాడ

ప్రతి పల్లె ప్రకృతి వనం కావాలి : మంత్రి పువ్వాడ

ఖమ్మం : రాష్ట్రంలోని ప్రతి పల్లె పకృతి వనం కావాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పల్లెల్లో పచ్చదనం పరిశుభ్రత పెంపొందించేందుకు ప్రజల తోడ్పాటు ఎంతో అవసరమన్నారు. శుక్రవారం సత్తుపల్లి మండలం సిద్దారం పంచాయతీలో పల్లె ప్రకృతి వనం,ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వీరయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాలను సంరక్షించి వాటిని మరింత అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. 

అలాగే సిద్దారం పంచాయతీలో రూ.12.60 లక్షలతో నూతనంగా నిర్మించిన వైకుంఠ ధామం, రూ.2.50 లక్షలతో నిర్మించిన కంపోస్టు షెడ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ చైర్మన్ మహేష్ తదితరులు ఉన్నారు.