శనివారం 30 మే 2020
Telangana - May 03, 2020 , 12:27:48

ప్రతి గింజా కొంటాం : పల్లా రాజేశ్వర్‌రెడ్డి

ప్రతి గింజా కొంటాం : పల్లా రాజేశ్వర్‌రెడ్డి

యాదాద్రి భువనగిరి : రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొంటామని రాష్ట్ర రైతు బంధు సమితి ఛైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి, చిన్న కందుకూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, టెస్కాబ్‌ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డితో కలిసి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కరోనా నేపథ్యంలో సైతం రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు మిల్లర్లు, ఎఫ్‌సీఐ, హమాలీలతో మాట్లాడుతూ కొనుగోళ్లలో ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. గన్నీ బ్యాగులు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పలుకులు అబద్దపు పలుకులేనన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు.


logo