మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 10:37:34

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి : మంత్రి ఎర్రబెల్లి

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి : మంత్రి ఎర్రబెల్లి

వ‌రంగ‌ల్ రూర‌ల్ : ఆరో విడ‌త తెలంగాణ‌కు హ‌రిత హారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని గీసుకొండ మండ‌లం మ‌రియపురం క్రాస్ రోడ్డు నుంచి చేల‌ప‌ర్తి గ్రామం వ‌ర‌కు 14కి.మీ. మేర మొక్కలు నాటే కార్యక్రమాన్ని పంచాయ‌తీరాజ్ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ హరిత హారంలో నాటిన మొక్కలను వంద శాతం బతికించాలన్నారు.

మొక్కలను సంరక్షించని ప్రజాప్రతినిధులు, అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు మొక్కలను రక్షించడమే ధ్యేయంగా గ్రామాల్లో పని చేయాలని ఆయన సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఊరూరా మంకీ ఫుడ్ కోర్టులు, యాదాద్రి మోడల్, విలేజ్ పార్కులను కూడా ఏర్పాటు చేయాలని మంత్రి చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


logo