శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 09:07:19

ఎయిర్‌పోర్టు నుంచి బ‌య‌ట‌కు వెళ్లాలంటే ఆర్టీపీసీఆర్ త‌ప్ప‌నిస‌రి

ఎయిర్‌పోర్టు నుంచి బ‌య‌ట‌కు వెళ్లాలంటే ఆర్టీపీసీఆర్ త‌ప్ప‌నిస‌రి

హైద‌రాబాద్ : కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో శ‌ంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఇత‌ర దేశాల నుంచి శంషాబాద్‌కు వ‌స్తున్న ప్ర‌యాణికుల‌కు నిబంధ‌న విధించారు. ప్ర‌యాణికులు త‌మ ప్ర‌యాణానికి 96 గంట‌ల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ రిపోర్టును త‌ప్ప‌నిస‌రిగా చూపించాల‌ని ఆదేశించారు. శంషాబాద్‌లో ల్యాండ్ కాగానే ఆ రిపోర్టు చూపిస్తేనే.. విమానాశ్ర‌యం నుంచి బ‌య‌ట‌కు పంపుతామ‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. ఇక్క‌డి నుంచి విదేశాల‌కు వెళ్లే ప్ర‌యాణికులు కూడా ఆర్టీపీసీఆర్ రిపోర్టును చూపించిన త‌ర్వాతే ప్ర‌యాణానికి అనుమ‌తిస్తామ‌ని తేల్చిచెప్పారు. ప్ర‌స్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 7 నుంచి 8 అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు న‌డుస్తున్నాయి. బ్రిట‌న్ నుంచి వ‌చ్చే విమానాలు ఇప్ప‌టికే నిలిచిపోయాయి. ఇక షార్జా, అబుదాబి, దోహా, ఖ‌తార్ తో పాటు ఇత‌ర విమానాశ్ర‌యాల నుంచి నిత్యం 900-1000 మంది ప్ర‌యాణికులు వ‌స్తున్నారు. వీరిలో 100 నుంచి 120 మంది వ‌ర‌కు ఆర్టీపీసీర్ రిపోర్టు లేకుండానే శంషాబాద్‌కు వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆర్టీపీసీఆర్ రిపోర్టును శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు త‌ప్ప‌నిస‌రి చేశారు.


logo