మంగళవారం 26 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 16:58:46

టీఆర్‌ఎస్‌కే అన్నివర్గాల మద్దతు : మంత్రి కొప్పుల

టీఆర్‌ఎస్‌కే అన్నివర్గాల మద్దతు : మంత్రి కొప్పుల

హైదరాబాద్‌ :  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్నివర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌కే మద్దతుగా నిలుస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. బుధవారం వెంకటాపురం డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించి పార్టీ అభ్యర్థి సబితాకిశోర్‌కు  ఓటు వేయాలని అభ్యర్థించారు. డివిజన్‌లో క్రిస్టియన్లు, బోహ్రా ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, మాజీ సైనికోద్యోగులు పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలోనే హైదరాబాద్ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని అన్నారు.  అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌కు నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. క్రిస్టియన్లు కేసీఆర్ పాలనను మెచ్చుకుంటూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రార్థన చేశారు. ఆస్తిపన్ను మాఫీపై మాజీ సైనికోద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo