బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 13:16:04

హరితహారంలో భాగస్వాములవ్వాలి : మంత్రి పువ్వాడ

హరితహారంలో భాగస్వాములవ్వాలి : మంత్రి పువ్వాడ

ఖమ్మం : హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం ఖమ్మం నగరం 3వ డివిజన్ పరిధిలోని బల్లెపల్లిలో ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి హరిత తెలంగాణ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ మొక్కల నాటింపుతోనే సాధ్యమని పేర్కొన్నారు. పట్టణాలు, గ్రామాల్లోని ఖాళీ స్థలాలు, పొలాల గట్లపై విరివిగా మొక్కలు నాటాలన్నారు.

హరితహారం లక్ష్యాన్ని అనుగుణంగా మొక్కలు నాటేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. హరితహారం విజయవంతానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బాధ్యత తీసుకోవాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, అటవీశాఖ అధికారి ప్రవీణ, అసిస్టెంట్ మున్సిపల్ కమినర్ మల్లేశ్వరి, కార్పొరేటర్ కొనకంచి సరళ, నాయకులు ప్రసాద్, అటవీ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo